![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -251 లో... నర్మద బాధపడుతుంటే సాగర్ వస్తాడు. మీ నాన్న గురించి ఆలోచించకు ఆయన బాగుంటాడని సాగర్ అంటాడు. నేను ఆలోచించేది మా నాన్న గురించి మాత్రమే కాదు.. నువ్వు ఆయనకు ఇచ్చిన మాట గురించి.. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటానని మాటిచ్చావ్ కానీ నువ్వు ఒక మాటపై ఉండవు.. మొన్న నన్ను ప్రేమ విషయంలో తప్పుగా అర్ధం చేసుకొని నేను గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవ్వనంటూ బుక్స్ విసిరేసావని నర్మద చెప్తుంది.
నా కోసం మీ వాళ్లందరిని వదులుకొని వచ్చావ్.. ఆ మాత్రం చెయ్యలేనా అని సాగర్ అనగానే నర్మద హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారని శ్రీవల్లి వినే ప్రయత్నం చేస్తుంది కానీ తనకి ఏం అర్ధం కాదు. వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారో కనిపెట్టాలని శ్రీవల్లి అనుకుంటుంది.
మరొకవైపు చందు దగ్గరికి శ్రీవల్లి వస్తుంది. భోజనం చేద్దాం రండి బావ అని పిలుస్తుంది. నేను చెయ్యనంటూ చందు కోప్పడుతాడు. ఎంత మోసం చేసారు.. ఇప్పుడు పది లక్షలు ఎలా కట్టాలని శ్రీవల్లిపై కోప్పడతాడు చందు.
మరోవైపు కళ్యాణ్ బ్లాక్ మెయిల్ చేస్తున్న దాని గురించి ప్రేమ ఆలోచిస్తుంటుంది. ధీరజ్ హెల్ప్ చేస్తాడు కదా ఆ విషయమే మర్చిపోయానని అతని దగ్గరికి వెళ్తుంది ప్రేమ. ఆలోపే విశ్వ, ధీరజ్ గొడవ పడతారు. నా చెల్లిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావని విశ్వ అనగానే.. తనపై కోప్పడి పంపిస్తాడు. అప్పుడే ప్రేమ వస్తుంది. నీతో మాట్లాడాలని ధీరజ్ తో ప్రేమ అంటుంది. వాడు చూసావా ఎలా అంటున్నాడో.. నిన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నానం.. అసలు నిన్ను ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాను.. నీ ప్రాబ్లమ్ నువ్వు చూసుకునే దానివి.. ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని ధీరజ్ అనగానే ప్రేమ అసలు విషయం చెప్పకుండా ఆగిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |